Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వంశీ, అనిల్, కష్ణ ప్రియ జంటగా రూపొందుతున్న చిత్రం 'సుగ్రీవ'. విక్రమ్ సాయి ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా ఈ సినిమాని మధుసూదన్ రెడ్డి, ఏడుకొండలు రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొత్తపల్లి నగేష్ దర్శకత్వలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం శుక్రవారం రామా నాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా హాజరైన రచయిత, దర్శకుడు బి.వి.ఎస్.రవి క్లాప్ ఇవ్వగా, నటుడు మహేష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ,'ఈ చిత్ర కథ చాలా బాగుంటుంది. అందరూ మెచ్చే కథతో వస్తున్నాం. ఆదరిస్తారనే నమ్మకం ఉంది' అని అన్నారు. 'ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సాగే ఈ చిత్రంలో మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక మ్యూజికల్ ఎంటర్టైనర్. ఈ నెల 21వ తేదీ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలు పెట్టనున్నాం. ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అయితే ఒక హీరోయిన్గా కష్ణ ప్రియని ఎంపిక చేశాం. మరో ప్రధాన నాయిక ఖరారు కావాల్సి ఉంది' అని దర్శకుడు కొత్తపల్లి నగేష్ చెప్పారు.