Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీవిద్య మహర్షి, దివ్య శ్రీపాద, సునీల్, చాందిని రావు ప్రధాన పాత్రల్లో నటించిన 'జీ 5' ఒరిజినల్ చిత్రం 'హెడ్స్ అండ్ టేల్స్'. 'కలర్ ఫొటో' ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. ఆ సినిమాలో నటించిన సాయికష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించారు. ఈనెల 22 నుండి 'జీ 5' ఓటీటీ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో కథానాయిక రెజీనా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసి, తనకెంతో బాగా నచ్చిందని తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు సాయికష్ణ ఎన్రెడ్డి మాట్లాడుతూ 'ఒక్క రాత్రిలో జరిగే కథతో తెరకెక్కిన చిత్రమిది. జీవితంలో వివిధ దశల్లో ఉన్న మహిళల సమస్యలను పరిష్కరించే విధానం వేరుగా ఉంటుంది. మహిళల కథతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి మహిళకు స్ఫూర్తినిస్తుంది. తమ కోసం, తమ హక్కుల కోసం నిలబడాలని చెబుతుంది. ఇందులో జీవిత తత్వమూ ఉంది. మనం ఆలోచించే దానికంటే విధితో మన జీవితాలు ఎక్కువ ముడిపడి ఉన్నాయని చెప్పే చిత్రమిది. ఇందులో అనీషా పాత్రలో శ్రీవిద్య మహర్షి, మంగ పాత్రలో దివ్య శ్రీపాద, మానవుల తలరాతలు రాసే భగవంతుడి పాత్రలో సునీల్ కనిపించనున్నారు. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ప్రతి ఒక్కరి పాత్ర తెరమీదకు వస్తుంది. అందరూ చూడదగ్గ సినిమా ఇది' అని తెలిపారు.