Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'మహా సముద్రం'. అజరు భూపతి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటించారు. దసరా కానుకగా ఈనెల14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని చిత్ర ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు అజరు భూపతి మాట్లాడుతూ, 'ఈ సినిమా జర్నీ నా జీవితంలో మర్చిపోలేనిది. ఇదొక భావోద్వేగాల ప్రేమ కథ. ఒకరి జీవితం మరొకరి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించేది అనేది ఇందులోని ప్రధానాంశం. ఈనెల 14న తెలుగు సినిమా ఇండిస్టీ బ్లాక్ బస్టర్ చూడబోతోంది. ఇందులో కొలవలేనంత ప్రేమను చూపించబోతున్నాం' అని అన్నారు.
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ, 'ఈ సినిమా దర్శకుడు అజరు భూపతికి ఒక బేబీ లాంటి సినిమా. 'ఆర్ఎక్స్100' చూసిన తర్వాత భూపతి మాత్రమే ఇలాంటి కథను హ్యాండిల్ చేయగలడనిపించింది. ఈ సినిమాకు ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్స్ కూడా బాగా సెట్టయ్యారు. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎంతో ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు' అని చెప్పారు.
'ఇలాంటి వేడుక కోసం తొమ్మిది సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను. అజరు భూపతిని నన్ను కలిపినందుకు జెమినీ కిరణ్ గారికి ప్రత్యేకంగా కతజ్ఞతలు. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. శర్వాతో ఈ సినిమా స్థాయి పెరిగింది. ఇది నాకొక మంచి రీ లాంచ్ సినిమా అవుతుంది' అని హీరో సిద్ధార్థ్ తెలిపారు. మరో హీరో శర్వానంద్ మాట్లాడుతూ,' ఈ సినిమా విడుదలయ్యాక ఇది తెలుగు సినిమారా అని అందరూ గర్వంగా చెబుతారు. 9 మందితో కొనసాగే ఈ కథ చాలా బావుంటుంది. దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు అజరుకు కతజ్ఞతలు. మహాసముద్రం సినిమా అనేది లవ్ స్టొరీ. ఎక్కువగా మహా పాత్ర చుట్టే ఉంటుంది. అలాంటి పాత్ర చేయడం చాలా కష్టం. అదితి చాలా బాగా చేసింది. అను కూడా చాలా బాగా వర్క్ చేసింది. ఇక ఈ సినిమాతో సిద్దార్థ్ వంటి మంచి స్నేహితుడు దొరికాడు. ప్రతి పండగ సమయంలో నేను హిట్ కొట్టాను. ఇప్పుడు కూడా ఈ దసరాకి ఈ సినిమాతో హిట్టు కొట్టబోతున్నా' అని అన్నారు.