Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు చిత్ర పరిశ్రమలో కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని, బాలీవుడ్‌లోనూ సత్తా చూపించిన డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్. ఆయన నిర్మాతగా మారుతూ 'ధర్మపురి' చిత్రాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నారు.
గగన్ విహారి, అపర్ణా దేవి జంటగా విశ్వజగత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, '1995 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. ఆ ఊరి గుడిలో, సర్పంచ్ దగ్గర పని చేసే ఓ జీతగాడు, బీడీ కార్ఖానాలో పని చేసే ఓ అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ నేపథ్యంలో, ధర్మపురిలోని ఒరిజినల్ లొకేషన్స్‌లో, చాలా రియాలిస్టిక్‌గా షూటింగ్ చేశాం. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్లో శేఖర్ మాస్టర్ సమర్పణలో, భాస్కర్ యాదవ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓషో వెంకట్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మార్తాండ్. కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు' అని తెలిపింది.
నాగమహేష్, జనార్ధన్, కేశవ, బస్టాప్ కోటేశ్వరరావు, రాగిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్: శేఖర్ మాస్టర్, రచన, దర్శకత్వం: విశ్వజగత్, నిర్మాత : భాస్కర్ యాదవ్ దాసరి.