Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాలీవుడ్లో మరో నూతన నిర్మాణ సంస్థ ఆరంభమైంది. నిర్మాతలు ప్రేమ్ కుమార్ పాండే, పీవీ సుబ్బారెడ్డి సంయుక్తంగా కలిసి భద్ర ప్రొడక్షన్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్‌పై నిర్మితమవుతున్న తొలి చిత్రం 'తగ్గేదేలే..'.
సోమవారం ఈ బ్యానర్ లోగోను ఎంఈఐఎల్ పీపీరెడ్డి ఆవిష్కరించగా, నిర్మాతలు ప్రేమ్ కుమార్ పాండే, పీవీ సుబ్బారెడ్డి 'తగ్గేదేలే' చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, అనన్య సేన్ గుప్తా, రవి శంకర్, రాజా రవీందర్, నాగబాబు, అయ్యప్ప శర్మ, పథ్వీ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రేమ్ కుమార్ పాండే మాట్లాడుతూ,'మంచి కథలను చెప్పేందుకు ఈ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాం. మన చరిత్రలో ఎన్నెన్నో కథలున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కల్చర్ ఉంటుంది. మా మామగారి స్ఫూర్తితోనే ఈ బ్యానర్ ప్రారంభమైంది. మా మామగారి తల్లి పేరు భద్రమ్మ. ఆమె పేరు మీదుగానే భద్ర ప్రొడక్షన్‌ను స్థాపించాం. కొత్త టాలెంట్‌కి మా బ్యానర్ చక్కటి ఫ్లాట్‌ఫామ్. కొత్త కథలను చెప్పేందుకు మేం సిద్దంగా ఉన్నాం. మా మొదటి చిత్రం 'తగ్గేదే..లే' కాన్సెప్ట్ బేస్డ్గా రాబోతోంది' అని తెలిపారు.
'సరికొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు తీయడానికే ఈ బ్యానర్‌ను స్థాపించాం. అందులో మొదటి ప్రయత్నంగా 'తగ్గేదే లే' సినిమాతో మీ ముందుకు వస్తున్నాం' అని మరో నిర్మాత సుబ్బారెడ్డి చెప్పారు.
దర్శకుడు శ్రీనివాస రాజు మాట్లాడుతూ, 'కాన్సెప్ట్ బేస్డ్ సినిమా, చిన్న చిత్రం అయినా కూడా ఏది అడిగితే అది నిర్మాతలు రాజీపడకుండా ఇచ్చారు. సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. నిర్మాతల సూచన మేరకు ఈ టైటిల్‌ని పెట్టాం' అని తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం : చరణ్ అర్జున్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రాజా రవీంద్ర, సినిమాటోగ్రఫర్ : వెంకట్ ప్రసాద్, ఎడిటర్ : గ్యారీ బీహెచ్, లిరిక్స్ : భాస్కర భట్ల, రామ జోగయ్య శాస్త్రి, ఆర్ట్ డైరెక్టర్ : కిరణ్ కుమార్ మన్నె, ఫైట్ మాస్టర్ : వెంకట్, రచన, దర్శకత్వం : శ్రీనివాస్ రాజు.