Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అనుభవించు రాజా'. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తోంది. తాజాగా యువ కథానాయకుడు నాగ చైతన్య ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'పాట చూశా. ఎంతో అద్భుతంగా ఉంది. భాస్కరభట్ల సాహిత్యం, గోపీ సుందర్ సంగీతం, రామ్ మిర్యాల గాత్రం ఈ పాటకు చక్కగా కుదిరాయి. ఆల్రెడీ నేను సినిమా కూడా చూశా. సినిమా ఆసాంతం ఎంజారు చేశాను. ఈ సినిమాలో రాజ్ తరుణ్ రెండు రకాల వెరియేషన్స్ చూపించారు. అద్భుతమైన సందేశంతో, ఆద్యంతం వినోదభరితంగా ఈ సినిమా ఉంటుంది' అని చెప్పారు.
''అనుభవించు రాజా..' అంటూ సాగే ఈ పాటలో జీవితాన్ని విచ్చలవిడిగా ఎంజారు చేసే కుర్రాడి పాత్రను వినోదంగా చూపించారు. కోడి పందెలు, రికార్డింగ్ డ్యాన్సులు, సంక్రాంతి పండుగ వాతావరణం.. అంతా కూడా ఈ పాటలో కనిపిస్తుంది. విజువల్స్ కలర్ఫుల్గా ఉన్నాయి. కొరియోగ్రఫీ కూడా చక్కగా కుదిరింది. గోపీ సుందర్ సంగీతం అందర్నీ అలరిస్తోంది. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన కశిష్ ఖాన్ నటిస్తున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది. పోసాని కష్ణమురళీ, ఆడుకాలమ్ నరేన్, అజరు, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకష్ణ, రవి కష్ణ, భూపాల్ రాజు, అరియానా తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.