Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హోరాహోరీగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ ఘనవిజయం సాధించింది. అధ్యక్ష పదవికి పోటీ చేసిన ప్రకాష్‌రాజ్‌పై మంచు విష్ణు 109 ఓట్ల భారీ తేడాతో గెలుపొంది, అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఆదివారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా 'మా' ఎన్నికలు జరిగాయి. వీటిల్లో కొన్ని ఫలితాలను మాత్రమే ఆదివారం ప్రకటించారు. సోమవారం పూర్తి స్థాయి ఫలితాల్ని ఎన్నికల అధికారి ప్రకటించారు.
2021-2023 రెండు సంవత్సరాలకు గాను మంచు విష్ణు 'మా' అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. అధ్యక్షుడిగా మంచు విష్ణు, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్ (ప్రకాష్‌రాజ్ ప్యానెల్), వైస్ ప్రెసిడెంట్స్‌గా మాదాల రవి, బెనర్జీ, జాయింట్ సెక్రటరీలుగా ఉత్తేజ్, గౌతంరాజు, ట్రెజరర్‌గా శివబాలాజీ ఎంపికయ్యారు. శివారెడ్డి, గీతాసింగ్, అశోక్‌కుమార్, బ్రహ్మాజీ, శ్రీలక్ష్మీ, మాణిక్, ప్రభాకర్, తనీష్, శ్రీనివాస్, హరినాథ్‌బాబు, సురేష్ కొండేటి, శివన్నారాయణ, సంపూర్ణేష్‌బాబు, శశాంక్, సమీర్, సుడిగాలి సుధీర్, బి.విష్ణు తదితరులు ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో 10 మంది మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు కాగా, 8 మంది ప్రకాష్‌రాజ్ ప్యానెల్‌కి సంబంధించిన వారు.
'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో మంచు విష్ణు మాట్లాడుతూ, 'సేవ చేయటానికి నన్ను అధ్యక్షుడిగా సభ్యులందరూ ఎన్నుకున్నారు. 'మా' అభివృద్ధికి ఇప్పుడే ఆట మొదలైంది. గేమ్ అన్నాక గెలుపు, ఓటమి ఉంటాయి. అలాగే ఎవరో ఒకరే గెలవాలి. ఈ ఎన్నికల్లో నేను గెలిచాను.
ప్రకాష్‌రాజ్ ఓడిపోయారు. ఆ బాధలో ఆయన తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. అలాగే నాగబాబు కూడా రాజీనామా చేశారు. అయితే వీళ్ళ రాజీనామాలను అధ్యక్షుడిగా నేను అంగీకరించటం లేదు. వీళ్ళిద్దరూ 'మా' కుటుంబ సభ్యులే. అందుకే నేనే స్వయంగా వెళ్ళి, వారితో చర్చిస్తా. వారి సలహాలు, ఆలోచనలు ఇప్పుడు 'మా'కెంతో అవసరం. ఈ ఎన్నికల్లో ప్రాంతీయవాదం గెలిచిందని కామెంట్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే ప్రకాష్‌రాజ్ అధ్యక్షుడిగా ఉండాలని 274 మంది సభ్యులు ఆయనకు ఓటు వేశారు. మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రాంతీయవాదం ఎక్కడుంది?. ప్రకాష్‌రాజ్ అధ్యక్షుడిగా ఉంటారు. పోటీ నుంచి విష్ణు సైడ్ అవ్వాలని నాన్న(మోహన్‌బాబు)తో చిరంజీవి అంటే, దానికి నాన్న అంగీకరించకుండా, ఎన్నికలకు వెళ్దామని చెప్పారు. ఈ ఎన్నికల్లో రామ్‌చరణ్ వాళ్ళ నాన్న చెప్పినట్టే ప్రకాష్‌రాజ్‌కి ఓటు వేశారు. ఆ పోజిషన్లో ఉంటే నేనూ మా నాన్న మాటనే పాటిస్తా. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని సమస్యలను, 'మా' కష్టసుఖాలను రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులకు వివరిస్తాం. వారితో చర్చించి, సమస్యల పరిష్కారానికి అందర్నీ కలుపుకుని 'మా'వంతు కృషి చేస్తాం' అని తెలిపారు.
'మా' ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. 'మా' అధ్యక్షుడిగా తెలుగు బిడ్డ ఉండాలని అందరూ కోరుకున్నారు. పరభాషా నటీనటులు సభ్యులుగా ఉండొచ్చు. కానీ పోటీ చేయడానికి అనర్హులుగా బైలాస్ మారుస్తామని ఎన్నికలకు ముందు విష్ణు ప్యానెల్ ప్రకటించింది. ఇటువంటి ఎజెండాతో, ఐడియాలజీతో ఉన్న అసోసియేషన్‌లో నేను సభ్యుడిగా ఉండలేను. నాకంటూ ఆత్మ గౌరవం ఉంది. అందుకే 21 ఏండ్ల 'మా' అనుబంధానికి గుడ్‌బై చెబుతున్నా. అలాగే కొంత మంది 'అతిథిలా.. వచ్చావ్.. అతిథిగా ఉండు..' అని చెప్పారు. వారు చెప్పినట్టే 'అతిథిగా..ఉంటా'. నేను తెలుగువాడిగా పుట్టకపోవడం దురదృష్టకరం.
- ప్రకాష్‌రాజ్