Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధా కష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం 'రాధే శ్యామ్'. బుధవారం కథానాయిక పూజా హెగ్డే బర్త్డే సందర్భంగా చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేసింది.
ఈ సందర్భంగా నిర్మాతలు వంశీ, ప్రమోద్, ప్రసీధ మాట్లాడుతూ, 'ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్. ఈ అద్భుతమైన ప్రేమ కథలో ప్రేరణగా పూజ హెగ్డే నటిస్తున్నారు. ప్రభాస్, పూజ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ప్రభాస్, పూజా మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు సినిమాకి ప్రాణం. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, అత్యద్భుతమైన సెట్లు.. అన్నింటినీ కలిపి ఈ సినిమాని ఎప్పటికీ మరిచిపోలేని ఒక గొప్ప ప్రేమ కథగా దర్శకుడు రాధాకష్ణ కుమార్ తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలయిన 'రాధే శ్యామ్' గ్లింప్స్ అన్ని భాషల్లో రికార్డులు తిరగరాసింది. లక్షల్లో లైకులు.. కోట్లలో వ్యూస్ వచ్చాయి. ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ అని మాచిత్ర గ్లింప్స్ మరోసారి నిరూపించింది. టాలీవుడ్లో ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప ప్రేమ కథల్లో ఈ సినిమా కూడా ఉంటుందనే నమ్మకం ఉంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. గోపీకష్ణ మూవీస్ బ్యానర్లో కష్ణంరాజు సమర్పిస్తుండగా, యువి క్రియేషన్స్పై ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాం. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న మా చిత్రాన్ని వరల్డ్ వైడ్గా విడుదల చేస్తున్నాం' అని అన్నారు.