Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిఎల్ఎన్ మీడియా నిర్మించిన చిత్రం 'పాయిజన్'. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేశారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సి. కళ్యాణ్ గారు మాట్లాడుతూ, 'ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌లో దర్శకుడు రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తీశాడు. ప్రొడ్యూసర్ శిల్పిక పెద్ద హిట్ కొట్టాలి. హీరో రమణకు ఇదొక బెంచ్ మార్క్ సినిమా కావాలి' అని చెప్పారు.
'ఫ్యాషన్ అండ్ గ్లామర్ ఇండిస్టీ బేస్డ్ మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముంబై, పూణే, లోనావాలా, హైదరాబాద్‌లోని డిఫరెంట్ లొకేషన్లలో చాలా రిచ్‌గా నిర్మించారు' అని దర్శకుడు తెలిపారు.