Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పెళ్ళి చేసుకోవాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటి?, పెళ్ళి తర్వాత ఎలా ఉండాలి? వంటి అంశాల గురించి చాలా తక్కువమంది తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లలకు అర్థమయ్యేలా చెబుతారు. ఈ నేపథ్యంలోనే మా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రం రూపొందింది. ఒక్కమాటలో చెప్పాలంటే పెళ్ళి విషయంలో ఓ కచ్చితమైన స్పష్టత ఇచ్చే సినిమా' అని నిర్మాత బన్నీ వాసు చెప్పారు.
అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. జీఎ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు, వాసువర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రం ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని నిర్మాత బన్నీవాసు బుధవారం మీడియాతో మాట్లాడుతూ, 'పెళ్ళి అనే ఒక సెన్సిటివ్ ఇష్యూ మీద మా సినిమా ఉంటుంది. ముఖ్యంగా పెళ్ళయిన తర్వాత అబ్బాయి లేదా అమ్మాయి ఎలా ప్రవర్తించాలి? అనే విషయాన్ని దర్శకుడు భాస్కర్ ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇందులో అఖిల్ అర్థోడాక్స్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయిగా నటిస్తే, పూర్తి స్వేచ్ఛతో ఉండే అమ్మాయిగా పూజా హెగ్డే నటించింది. భిన్న నేపథ్యాలు ఉన్న వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది?, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే టైటిల్‌కి దర్శకుడు ఎటువంటి జస్టిఫికేషన్ ఇచ్చారనేది మాటల్లో కంటే వెండితెరపై చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది' అని చెప్పారు.
ఏపీలో కొన్ని థియేటర్లు జీఎస్టీ పరిధిలో లేవు. టాక్స్‌లు సరిగా కట్టడం లేదు. ఈ విషయంలో పారదర్శకత కోసమే ఆన్ లైన్ టికెటింగ్ ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే ఆన్లైన్ టికెట్లను ప్రభుత్వమే అమ్మాలనుకోవడం లేదు. ప్రతి రోజూ ఎన్ని టికెట్లు అమ్మారనే విషయంలో క్లారిటీ కోరుతుంది. ఈ విషయంలో కొంత మిస్ అండర్స్టాండింగ్ వచ్చింది. 100% ఆక్యుపెన్సీ, సెకండ్ షో అనుమతుల విషయమై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకంతో ఉన్నాం.