Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప: ది రైజ్'. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్రంలోని 'చూపే బంగారమాయనే.. శ్రీవల్లి..' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది.
ఈ పాటకు విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, 'దాక్కో దాక్కో మేక..' పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రష్మిక మందన్నపై చిత్రీకరించిన 'శ్రీవల్లి..' పాటకు అనూహ్య స్పందన వస్తుంది. సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను అత్యద్భుతంగా పాడారు. ఈ పాటలో అల్లు అర్జున్ లుక్‌కి టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. చంద్రబోస్ రాసిన సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు అందర్నీ విశేషంగా అలరిస్తున్నాయి. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు' అని చెప్పారు.