Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ కుమార్ బడుగు రూపొందించిన తాజా చిత్రం 'తమసోమా జ్యోతిర్గమయ'. ఈ చిత్రం ద్వారా ఆనంద్ రాజ్, శ్రావణిశెట్టి హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. విమల్ క్రియేషన్స్ బ్యానర్ పై తడక రమేష్ నిర్మిస్తున్న చిత్రమిది. గుణ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ. ఈ నెల 29న వరల్డ్ వైడ్‌గా పద్మజ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేసిన సందర్భంగా నిర్మాత తడక రమేష్ మాట్లాడుతూ, 'చేతివత్తులపై ఆధారపడి జీవించే వారి కథే ఈ సినిమా. మారుతున్న కాలాన్ని బట్టి చేతివత్తుల వాళ్ళు కూడా మారగలిగితే చాలా మందికి ఉపాధి దొరుకుంటుందని చెప్పే ప్రయత్నం చేశాం' అని తెలిపారు. దర్శకుడు విజరు కుమార్ మాట్లాడుతూ, '2001 నుంచి 2014 మధ్యకాలంలో సిరిసిల్ల, భూదాన్ పోచంపల్లిలో నేత కార్మికుల జీవన స్థితిని ఈ చిత్రంలో చూపించబోతున్నాం' అని అన్నారు.