Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాయల్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మి శ్రీనివాస్ దర్శకత్వంలో సుబ్బారావు రాయన, శివకష్ణ నిచ్చెనమెట్ల నిర్మిస్తున్న చిత్రం '14'. నోయల్, విశాఖ ధీమాన్, పోసాని కష్ణ మురళి, శ్రీకాంత్ అయ్యంగార్, రతన్, జబర్దస్త్ మహేష్ ముఖ్యపాత్రధారులు. ఈ చిత్ర టీజర్‌ను హీరో శ్రీ విష్ణు రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'ఈ సినిమా కొత్త ప్రొడ్యూసర్లకు, దర్శకుడికి మంచి పేరు తీసుకురావాలి' అని చెప్పారు. 'దర్శకుడు చెప్పిన కథ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చాలా భిన్నంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది' అని నిర్మాత సుబ్బారావు రాయన తెలిపారు. మరో నిర్మాత శివకష్ణ నిచ్చెనమెట్ల మాట్లాడుతూ, 'మా సినిమా అందరి అంచనాలకు మించి ఉంటుంది. కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది' అని అన్నారు. 'ఈ చిత్రానికి '14' అనే టైటిల్ ఎందుకు పెట్టాం?, ఈ టైటిల్ జస్టిఫికేషన్, కథాకథనాలు ఎలా ఉంటాయి అనే దాన్ని మాటల్లో కంటే వెండి తెరమీద చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది' అని దర్శకుడు లక్ష్మీ శ్రీనివాస్ చెప్పారు.