Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హ్యాస్ ట్యాగ్ పిక్చర్ బ్యానర్ పై ఆట సందీప్, ప్రాచి, జ్యోతి నటీనటులుగా యోగి కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'లవ్ యు టూ'. శ్రీకాంత్ కీర్తి నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను తన బర్త్ డే సందర్భంగా అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ వైజాగ్‌లో రిలీజ్ చేశారు. అలాగే ఈ ట్రైలర్‌ను ప్రత్యేకంగా పాత్రికేయులకు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో దర్శకుడు యోగి మాట్లాడుతూ, 'లవ్ అనేది మనిషి ఏ స్టేజ్‌లో ఉన్నా, ఏ ఏజ్‌లో ఉన్నా, మ్యారిటల్ స్టేటస్ ఏదైనా ఒకవేళ ఆ ఇద్దరి మధ్య అది ప్రేమే అని అనుకుంటే అది ప్రేమే. ఇందులో డ్రామా, ఎమోషన్‌కి ఎంత ప్రాముఖ్యత ఉందో మ్యూజిక్‌కి కూడా అంతే ప్రాధాన్యం ఉంది' అని తెలిపారు.
హీరో ఆట సందీప్ మాట్లాడుతూ, 'మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను బేస్ చేసుకుని దర్శకుడు రాసుకున్న కథ ఇది' అని చెప్పారు. 'చాలా బోల్డ్ కథని సెలెక్ట్ చేసుకుని దర్శకుడు ఈ సినిమా చేశారు. మంచి కాన్సెప్ట్‌ని సింపుల్‌గా, నీట్‌గా తీసుకొచ్చారు. దీనికి తగ్గట్టే మంచి మ్యూజిక్ కుదిరింది' అని సంగీత దర్శకుడు సాకేత్ చెప్పారు.