Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజరు, నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం'. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సజన్ ఎరబోలు నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో థియేటర్లలో సినిమా విడుదల కానుంది. లహరి ఆడియో ద్వారా పాటలు విడుదల కానున్నాయి. బుధవారం ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ, ''సినిమా గురించి చెప్పేముందు మా పార్ట్నర్, 'ఎస్ ఒరిజినల్స్' అధినేత సజన్, హర్ష, ప్రశాంత్, రాజ్, గ్యారీ, భువన్, ఉష, నా స్నేహితులు సునీత్, అఖిల్... వీళ్ళు లేకపోతే సినిమా కంప్లీట్ అవ్వదు' అని తెలిపారు. దర్శకుడు హర్ష పులిపాక మాట్లాడుతూ, 'ఈ సినిమా ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాంటిది. టికెట్ తీసుకుని అమ్యూజ్మెంట్ పార్క్‌కు వెళితే డిఫరెంట్ రైడ్స్ ఉంటాయి. అలాగే, మా సినిమాలో కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ డిఫరెంట్ రైడ్స్ ఉంటాయి' అని తెలిపారు.
'ఈ సినిమా చాలా గొప్పగా ఉంటుంది. ఇందులో మంచి పాత్ర చేశా' అని రాహుల్ విజరు అన్నారు. శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ, 'ఇందులో లేఖ అనే పాత్రకు నన్ను ఎంపిక చేసుకున్నందుకు థ్యాంక్యూ. 'దొరసాని' తర్వాత మరో మంచి సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు.