Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'శ్యామ్ సింగరారు'. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రాహుల్ సంకత్యాన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం గురువారం ఓ పోస్టర్ని రిలీజ్ చేసింది.
'కలకత్తా కాళీమాత విగ్రహం ముందు నాని ఉన్న ఈ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్న ఈ పోస్టర్ నాని అభిమానులకు ఐ ఫీస్ట్‌లా ఉంది. వాసు పాత్రలో నానీని ఎంతో ఇంటెన్సీవ్‌గా చూపించారు. బెంగాలీ కుర్రాడు శ్యామ్ సింగరారు పాత్రలో నాని కనిపిస్తారు. అలాగే వాసుగా డిఫరెంట్ గెటప్‌తో మెప్పించనున్నారు. అతని ప్రేమ, అతని వారసత్వం, అతని మాట అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ పోస్టర్ సర్వత్రా హాట్ టాపిక్ అయ్యింది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్పై పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా రాబోతున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత వెంకట్ బోయనపల్లి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది. నాని సరసన సాయి పల్లవి, కతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటిస్తున్నారు.