Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది సాయికుమార్ హీరోగా చాగంటి ప్రొడక్షన్లో నూతన చిత్ర ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోస్‌లో వైభవంగా జరిగింది. శివశంకర్ దేవ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని అజరు శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. హీరో ఆది సాయికుమార్ పై నిర్మాత పుస్కర రామ్మోహానరావు క్లాప్ ఇవ్వగా, మరో నిర్మాత కె.ఎస్.రామారావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత అజరు శ్రీనివాస్ మాట్లాడుతూ, 'దర్శకుడు దేవ్ చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది. ఆది సాయికుమార్ కెరీర్లో ఈ కథ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. నవంబర్ రెండో వారంలో చిత్రీకరణ స్టార్ట్ చేస్తాం' అని చెప్పారు. 'ఇదొక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్. ఆది పాత్ర చాలా ఢిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమాతో ఓ కొత్త ఆదిని చూస్తారు' అని దర్శకుడు శివశంకర్ దేవ్ అన్నారు.
హీరో ఆదిసాయికుమార్ మాట్లాడుతూ, 'ఈ కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. దసరా రోజున సినిమా ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో పోషిస్తున్న పాత్ర నా కెరీర్లోనే ది బెస్ట్‌గా నిలిచిపోతుంది' అని తెలిపారు.