Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం 'పెళ్లి సందడి'. ఈ చిత్రానికి ఆయన శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కష్ణ మోహన్‌రావు సమర్పణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా సందర్భంగా ఈ సినిమా విడుదలైంది.
ఈ నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో డైరెక్టర్ గౌరి రోణంకి మాట్లాడుతూ, 'దర్శకురాలిగా అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావుగారికి థ్యాంక్స్.
ఈ సినిమా గ్రాండ్ ఓపెనింగ్ దక్కింది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో వశిష్టగా దర్శకేంద్రుడు అద్భుతంగా నటించారు' అని చెప్పారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ, 'మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. పాతికేళ్ల ముందు తీసిన 'పెళ్లి సందడి' చిత్రాన్ని ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లు మార్చి తీసిన డైరెక్టర్ గౌరి రోణంకికి థ్యాంక్స్. నేను ఎంతోమంది స్టార్ హీరోలను, హీరోయిన్స్‌ను ఇండిస్టీకి పరిచయం చేశాను. ఇప్పుడు అదే నమ్మకంతో రోషన్‌ను కూడా నాకు అప్పగించారు. తను అంతే చక్కగా నటించాడు. శ్రీలీల అందంగా నటించింది. కీరవాణి, చంద్రబోస్ కాంబినేషన్లో చేసిన పాటలు అందరికీ అద్భుతంగా కనెక్ట్ అయ్యాయి. పాటలకు వస్తున్న రెస్పాన్స్ చూసి, ప్రేక్షకుల ఈలలు వేస్తున్నారు. కుటుంబ కథా చిత్రాలను చూడాలనుకునే ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చి సినిమాను ఎంజారు చేస్తున్నారని డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్స్ చేసి చెబుతున్నారు. ఇటువంటి సందర్భంలోనే థి¸యేటర్స్కు వంద శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కి, ఆయన ప్రభుత్వానికి థ్యాంక్స్' అని చెప్పారు.