Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు, ఆయన ప్యానెల్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం శనివారం వైభవంగా జరిగింది. రెండేండ్ల పాటు 'మా' నూతన కార్యవర్గం బాధ్యతల్ని నిర్వహించనుంది.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, 'విష్ణు గెలుస్తాడు అని పది రోజుల ముందే చెప్పాను. మా అసోసియేషన్ చిన్న వ్యవస్థ కాదు. 912 మంది ఫ్యామిలీలు ఉన్నాయంటే అది పెద్ద వ్యవస్థ. అలాంటి 'మా' అసోసియేషన్ కోసం ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాం. అలాగే మోహన్ బాబుకి కోపం, ఆవేశం ఎక్కువ. అయితే ఆయన కోపం ఆయనకే చేటు చేసిందే తప్ప, ఎవ్వరికీ చెడు చేయలేదు. తప్పును తప్పుగా చెప్పే వ్యక్తి. ధైర్యంగా తప్పును ప్రశ్నిస్తారు' అని చెప్పారు. మోహన్ బాబు మాట్లాడుతూ, 'ఇది కళాకారుల వేదిక. రాజకీయాలు ఇక్కడ ఉండకూడదు. కళాకారులంతా ఒకే తల్లి బిడ్డలు. మేం ఇంత మంది ఉన్నాం.. అంత మంది ఉన్నామని బెదిరించారు. కానీ మా సభ్యులు ఎవ్వరూ భయపడలేదు. మా ఓటు మా సొంతమని నా బిడ్డను గెలిపించారు. నా బిడ్డ విజయానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి నరేష్. భారతదేశం గర్వించదగ్గ ఖ్యాతిని 'మా'కు తీసుకురావాలి. కలిసికట్టుగా పని చేసుకుందాం. కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ని కలుస్తాం' అని తెలిపారు.
'మోహన్ బాబు కొడుకు మంచు విష్ణుగా నేను ఈ రెండేళ్లలో ఏం చేయగలనో చూపిస్తాను. 24 క్రాఫ్ట్స్ సహకారం ఉంటే, 'మా'ను మరింత బలోపేతం చేయవచ్చు. ఆట ఆడినప్పుడు ఎవరో ఒకరు గెలుస్తారు. మేం గెలిచాం. అవతలి ప్యానెల్ వాళ్లు దాన్ని గౌరవించాలి. వారి సలహాలను నేను గౌరవిస్తాను. వారిలో కొంత మంది రిజైన్ చేశారు. అది దురదష్టం. అయినప్పటికీ ఆట ఆగదు' అని మంచు విష్ణు అన్నారు.