Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనోజ్ గోపాల్ కష్ణ, శ్రీ ఇందు నాయకానాయికలుగా రూపొందుతున్న చిత్రం 'హలో జాను'. ఎస్.ఎమ్. క్రియేషన్స్, సుముధ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 'సంఘ సంస్కర్త భగవత్ రామానుజాచార్యులు', 'మనం మారాలి', 'చిన్నిగుండెల్లో ఎన్ని ఆశలో' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మంజుల సరోజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయదశమి సందర్భంగా ఈ సినిమా చిత్రీకరణను మేకర్స్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా దర్శకురాలు మంజుల సరోజు మాట్లాడుతూ, 'రొమాన్స్, కామెడీతో ప్రేక్షకులకు కనువిందు చేసేలా ఈ సినిమా ఉంటుంది. సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణను పూర్తి చేయనున్నాం. మురళీ ధర్మపురితో పాటు సుద్దాల అశోక్ తేజ అందించిన అద్భుతమైన సాహిత్యం, యూవీ నిరంజన్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి' అని తెలిపారు. 'కొన్ని కన్నడ చిత్రాల్లో నటించాను. ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు, ప్రేక్షకులకు హీరోగా పరిచయం అవుతున్నాను. నేను హీరోగా మారడానికి స్పూర్తి పవన్ కల్యాణ్. ఇందులోని ఓ పాటను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశాం. ఇదొక లవ్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్' అని హీరో మనోజ్ గోపాల్ కష్ణ అన్నారు. మరో ప్రముఖ హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: యూవీ నిరంజన్, పాటలు: మురళీ ధర్మపురి, సుద్దాల అశోక్ తేజ, కెమెరా: వేణు ఆర్మ్స్, దర్శకత్వం: మంజుల సురోజు.