Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజీవ్, విహారిక జంటగా సతీష్ (నాని) దర్శకత్వంలో దిరిశాల నరేష్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం 'మురుగన్'. దిరిశాల నరేష్ చౌదరి సమర్పణలో డికేసి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆదివారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ఆరంభమైంది. హీరో,హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మ్యూజిక్ డైరెక్టర్ కోటి క్లాప్‌నివ్వగా, వ్యాపారవేత్త చక్రధర్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. చిత్ర దర్శకుడు సతీష్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత నరేష్ చౌదరి మాట్లాడుతూ, 'దర్శకుడు కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది. ఇందులో హీరోగా కోటి గారి అబ్బాయిని సెలెక్ట్ చేశాం. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు.
'యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కథాకథనాలు చాలా వినూత్నంగా ఉంటాయి' అని దర్శకుడు సతీష్ అన్నారు. హీరో రాజీవ్ మాట్లాడుతూ, 'వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందబోయే ఈ సినిమాని చాలా రియలిస్టిక్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం' అని చెప్పారు. 'ఇది నా రెండవ చిత్రం. పాత్ర పరంగా నటనకు మంచి స్కోప్ ఉన్న చిత్రమిది' అని విహారిక తెలిపారు.