Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతాప్ పోతన్, అరవింద్ కష్ణ, అలీ రెజా, ఊర్వశీరారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'గ్రే' (ద స్పై హూ లవ్డ్ మి అనేది ఉపశీర్షిక). నూతన నిర్మాణ సంస్థ అద్వితీయ మూవీస్ ప్రై.లి పతాకంపై కిరణ్ కల్లాకురి నిర్మాతగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ మదిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆదివారం ప్రసాద్‌ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
మూహుర్తపు సన్నివేశానికి దర్శకుడు వీఎన్. ఆదిత్య క్లాప్ ఇవ్వగా, ప్రసాద్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. చిత్ర బృందానికి రచయిత లక్ష్మీ భూపాల్ స్క్రిప్ట్ అందజేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ మదిరాజు మాట్లాడుతూ, ''గ్రే' అనేది ఒక నెగటివ్ షేడ్ అనే కాదు. ఓ రిలేషన్ షిప్. ఓ రెవల్యూషన్. 'గ్రే' మనలైఫ్లోనూ ఉంది. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన నీడే ఒక 'గ్రే'. ఇదొక స్పై థ్రిల్లర్. నమ్మలేని అంశాలు ఉంటాయి. తెలియని ఎక్స్‌ప్రెషనే గ్రే. అదే స్క్రీన్ పై కనిపిస్తుంది. ఈ నెల 22 నుంచి చిత్రీకరణ స్టార్ట్ అవుతుంది. డిసెంబరు కల్లా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి, సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం' అని చెప్పారు.
'ఈ చిత్ర నిర్మాత కిరణ్ నా తమ్ముడు. ఈ సినిమాలో నన్ను భాగమవ్వమని అడిగినప్పుడు కథ విన్నాను. చాలా బాగా నచ్చింది. అలాగే ప్రేక్షకులకూ నచ్చుతుందని భావిస్తున్నా' అని సహ నిర్మాత శ్రీదేవి అన్నారు. నిర్మాత కిరణ్ కల్లాకురి మాట్లాడుతూ, 'ఈ సినిమా కోసం రాజుగారు, రమేష్ చదలవాడ చాలా కష్టపడ్డారు. సినిమాకి డబ్బులు పెట్టడం సులువే. కానీ మంచి అవుట్‌పుట్ ఇవ్వడం కష్టం. థ్రిల్లర్ సినిమాలు పెద్దగా తెలుగులో రాలేదు. ఇదొక మంచి థ్రిల్లర్ మూవీ. నమ్మలేని అంశాలతో ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది' అని తెలిపారు.