Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగ శౌర్య, రీతువర్మ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'వరుడు కావలెను'. లక్ష్మీ సౌజన్యని దర్శకురాలిగా పరిచయం చేస్తూ సూర్య దేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 29న విడుదల కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా', 'దిగు దిగు నాగ', 'మనసులోనే నిలిచి పోకె..' పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. అలాగే ఇప్పటివరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలకు కూడా ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు లభించాయి. సామాజిక మాధ్యమాల్లో సైతం మంచి ప్రాచుర్యం లభించింది. ప్రేమ, వినోదం, భావోద్వేగాల సమాహారంగా ఈ చిత్రం రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 29న విడుదలవుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకాన్ని దర్శక,నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు' అని చెప్పారు.
నదియా, మురళీశర్మ, వెన్నెలకిషోర్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్య దేవర నాగవంశి, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య.