Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథానాయిక కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'గుడ్‌లక్ సఖి'. ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పదిరి నిర్మించారు.
ఆదివారం కీర్తిసురేష్ బర్త్‌డే సందర్భంగా ఆమెకు విషెస్ తెలియజేస్తూ చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో గన్నుతో గురి పెట్టి, సరదాగా నవ్వుతున్న కీర్తి సురేష్ అందర్నీ అలరిస్తోంది. అలాగే నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ఈ కొత్త పోస్టర్ ద్వారా ప్రకటించారు.
ఈ సందర్భంగా చిత్రయూనిట్ మాట్లాడుతూ, 'స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో గ్రామీణ అమ్మాయిగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఓ గ్రామీణ అమ్మాయి షూటర్‌గా ఎలా మారింది అనేది ఆద్యంతం ఆసక్తికరం. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్లు సినిమాపై అంచనాలను బాగా పెంచాయి. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి మేకర్స్ విడుదల చేస్తారు' అని చెప్పారు.