Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'తీస్ మార్ ఖాన్'. 'నాటకం' ఫేమ్ కళ్యాణ్.జి.గోగణ దర్శకుడు. విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా పండగని పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర బందం రిలీజ్ చేసింది.
'టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆది లుక్‌కి రెస్పాన్స్ టెర్రిఫిక్‌గా ఉంది. స్టూడెంట్, రౌడీ, పోలీస్‌గా ఇలా.. మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది నటిస్తుండగా, హై ఓల్టేజ్ యాక్షన్ ఓల్టేజ్ ఎంటర్టైనర్గా భారీ బడ్జెట్‌తో, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మాత నాగం తిరుపతిరెడ్డి నిర్మిస్తున్నారు. ఆకర్షించే అందం, చక్కటి అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తుంటే, ఓ కీలక పాత్రలో సునీల్ మెరవబోతున్నారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న ఈ చిత్ర అప్డేట్స్ త్వరలోనే తెలియనున్నాయి' అని చిత్ర యూనిట్ తెలిపింది. అనూప్‌సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ ఠాకూర్, పూర్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : తిరుమల రెడ్డి, మ్యూజిక్ : సాయి కార్తీక్, ఎడిటర్ : మణికాంత్, సినిమాటోగ్రాఫర్: బాల్ రెడ్డి.