Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'భీమ్లానాయక్'. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. అగ్ర దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ స్క్రీన్ప్లే, సంభాషణలు అందిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని 'అంత ఇష్టమేందయ..' అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, 'భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలను వ్యక్త పరచ గలిగే పాటలు గతంలో వచ్చాయి. కానీ ఆ భావం ఎప్పటికప్పుడు నిత్యనూతనం. నిత్యామీనన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తన పట్ల భర్త తాలూకు ప్రేమ ఏ పతాక స్థాయిలో ఉన్నదో ఈ పాటలో చక్కగా, కొత్త పదాల్లో కుదిరింది. అతితక్కువ సమయంలో నేను రాయడం, తమన్ బాణీ కట్టడం జరిగిపోయాయి. ఒక గంట వ్యవధిలోనే రూపకల్పన జరిగిన ఈ పాటను పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, సాగర్ చంద్ర విని, ఆస్వాదించి, ఆమోదించడం విశేషంగా భావిస్తున్నా. తమన్ చక్కటి బాణీకి చిత్రగారి స్వరం ప్రాణం పోసి, పాట ఔన్నత్యాన్ని మరింత ఇనుమడింప చేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు' అని అన్నారు.
'అంత ఇష్టమేందయ..' అంటూ సాగే ఈ పాటని వినగానే చిత్ర కథానుసారాన్ని అనుసరించి రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఆవిష్కతం అయిన ప్రేమానురాగాల గీతంలా అనిపిస్తుంది. వీనుల విందుగా సాగిన తమన్ స్వరాలు ఈ గీతాన్ని మరో స్థాయికి చేర్చాయి. దసరా కానుకగా విడుదలైన ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తోంది. మా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2022, జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని నిర్మాత సూర్య దేవర నాగవంశీ తెలిపారు.
నిత్యా మీనన్, సంయుక్త మీనన్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్, ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్, సంగీతం: తమన్.ఎస్, ఎడిటర్:నవీన్ నూలి, ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి. ప్రసాద్.