Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న సినిమా 'బుజ్జి ఇలా రా'. (సైకలాజికల్ థ్రిల్లర్ అనేది ట్యాగ్‌లైన్). చాందిని అయ్యంగార్ హీరోయిన్. రూపా జగదీశ్ సమర్పణలో ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్పి, జీ నాగేశ్వర రెడ్డి టీమ్ వర్క్ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ,'ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా జి. నాగేశ్వరరెడ్డి గారే. డైరెక్టర్ అంజీ అద్భుతంగా సినిమాని తీశారు' అని చెప్పారు. 'ఈ సినిమాలో కొత్త ధన్‌రాజ్‌ను చూస్తారు. ఈ సినిమా ఈ స్థాయికి రావడానికి కారణం నాగేశ్వర్ రెడ్డి గారు. నన్ను నమ్మి ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాకి ఆయన కో డైరెక్టర్ కంటే ఎక్కువ పని చేశారు. దర్శకుడు అంజి 45 రోజుల్లో ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని తీశారు' అని హీరో ధన్‌రాజ్ తెలిపారు.
నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, 'ధన్ రాజ్ ఈ సినిమా కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశాడు. ఎన్నో సినిమాలు పోగొట్టుకున్నాడు. డబ్బును కూడా కాదనుకున్నాడు. ధన్‌రాజ్ పడిన కష్టానికి ప్రేక్షకులు మంచి విజయాన్ని అందిస్తారు. ఈ సినిమా తరువాత ధన్‌రాజ్‌కు మంచి పొజిషన్ వస్తుంది. ఇందులోని ప్రతీ ఒక్క పాత్ర అద్భుతంగా ఉంటుంది. అందరూ బాగా నటించారు. సినిమాని చూడండి. కచ్చితంగా ఎంజారు చేస్తారు' అని చెప్పారు.