Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని నటిస్తున్న తాజా చిత్రం 'శ్యామ్ సింగ రారు'. రాహుల్ సంకత్యాన్ దర్శకుడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట బోయనపల్లి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని ఒకేసారి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిది. అలాగే ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ రిలీజ్ కూడా ఈ సినిమానే కానుంది. ఈ సినిమాని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి నాలుగు దక్షిణాది భాషల్లో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, సాయి పల్లవి, నానిలపై ఓ రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పీరియడ్ జోన్లో సాయి పల్లవి, నానిల మధ్య అద్భుతమైన ప్రేమ కథ ఉండోబోతోందని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు వీఎఫ్ఎక్స్ కోసం భారీ టీం పని చేస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్పై ప్రొడక్షన్ నెంబర్ 1గా రాబోతోన్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా, జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత కతి మహేష్, ప్రతిభా వంతుడైన యశ్ మాస్టర్ ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్లుగా పని చేస్తున్నారు' అని తెలిపింది.