Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మధుర వైన్స్'. జయ కిషోర్ బండి దర్శకుడు. ఎస్ ఒరిజినల్స్, ఆర్.కె.సినీ టాకీస్ బ్యానర్ పై రాజేష్ కొండెపు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్లో చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జయ కిషోర్ మాట్లాడుతూ, 'ఎట్టకేలకు మా సినిమా కోవిడ్ కారణం కాకుండానే అన్ని అడ్డంకులను దాటుకుని ఈనెల 22 న చాలా గ్రాండ్‌గా రిలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది' అని తెలిపారు. హీరో సన్నీ నవీన్ మాట్లాడుతూ,'ఇది నా మొదటి చిత్రం. ఈ సినిమా ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు' అని అన్నారు. మరో హీరో సమ్మోహిత్ మాట్లాడుతూ,'ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో ఓ మంచి క్యారెక్టర్ చేశాను' అని తెలిపారు. 'జయ కిషోర్ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే కల్ట్ ఫిలిం తీసినట్లు అనిపించింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి జయకిషోర్కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను' అని 'ఉప్పెన' దర్శకుడు బుచ్చి బాబు అన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన హీరో సందీప్‌కిషన్ మాట్లాడుతూ, 'దర్శక, నిర్మాతలు, హీరోలు చాలా కాన్ఫిడెంట్గామాట్లాడుతున్నారంటే, నో డౌట్ సినిమా బాగా వచ్చిందని అర్థమవుతోంది. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి, మంచి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను' అని తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలు: రాజేష్ కొండెపు, సజన్ యారబోలు, కో ప్రొడ్యూసర్: సాయి శ్రీకాంత్ చెరువు.