Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరించేందుకు కథానాయకుడు విశ్వక్ సేన్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన మరో ప్రయోగం చేయబోతున్నారు. సరికొత్త జోనర్లో 'గామి' అనే చిత్రాన్ని చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్‌కి మంచి స్పందన లభించింది.
ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ, 'అద్భుతమైన టెక్నికల్ వ్యాల్యూస్, అత్యున్నతమైన విజువల్స్‌తో మా చిత్ర టీజర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇందులో అఘోరగా విశ్వక్సేన్ నటిస్తున్నారు. టీజర్లో ఆయన కనిపించకపోయినా రెండు మూడు షాట్స్‌లో ఆ ఫీల్ కనిపిస్తుంది. దర్శకుడు విద్యాధర్ కాగిట ఈ చిత్రాన్ని అద్భుతంగా తెెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం' అని తెలిపారు. విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి వి సెల్యులాయిడ్, కార్తీక్ శబరిష్ నిర్మాతలు.