Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రొమాంటిక్' సినిమా ట్రైలర్ నిజంగానే రొమాంటిక్‌గా ఉందని, ట్రైలర్ అదిరిపోయిందని అగ్ర కథానాయకుడు ప్రభాస్ అన్నారు. ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా రూపొందిన చిత్రం 'రొమాంటిక్'. అనిల్ పాదూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మించారు. ఈనెల 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రభాస్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఇందులో ఆకాష్ అద్భుతంగా నటించాడు. పదేళ్ల అనుభవం ఉన్నవాడిలా, స్టార్ స్టేటస్ వచ్చినట్టుగా లాస్ట్ షాట్లో అద్భుతంగా అనిపించాడు. ఆకాష్ మొదటి సినిమాకి ఇప్పటికి చాలా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. హీరోయిన్ కేతిక అందరికీ ఈజీగా రీచ్ అవుతుంది. రమ్యకష్ణగారు ఎప్పటిలానే అద్భుతంగా నటించారు. దర్శకుడు ఎంతో అద్భుతంగా తీశాడు. ఈనెెల 29న ఈ సినిమాని అందరూ చూడండి' అని చెప్పారు.
'డార్లింగ్ ప్రభాస్ ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. సినిమా విడుదల చేస్తున్నామని తెలిశాక ప్రభాస్ ఫోన్ చేసి మరీ సినిమా గురించి ట్వీట్ వేయాలా?, పోస్ట్ చేయాలా?, ఏదైనా ఇంటర్వ్యూ ఇవ్వాలా?, ఈవెంట్‌కు రావాలా? అని అడిగాడు. ప్రభాస్ మంచి వాడు అని చెప్పటానికి ఇంతకన్నా ఏం కావాలి?' అని దర్శక, నిర్మాత పూరి జగన్నాథ్ అన్నారు. ఛార్మీ మాట్లాడుతూ, 'మా ట్రైలర్‌ని ప్రభాస్ రిలీజ్ చేయటం హ్యాపీగా ఉంది. ఇందులో డార్లింగ్ అంటూ ఓ స్పెషల్ సాంగ్ సర్ప్రైజింగ్గా ఉండబోతోంది. వీఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అనిల్ ఈ మూవీని సూపర్‌గా తెెరకెక్కించాడు. ఆకాష్, కేతిక శర్మ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది' అని అన్నారు.
చిత్ర బృందం మాట్లాడుతూ, '2నిమిషాల 10 సెకండ్ల నిడివిగల ఈ ట్రైలర్ 'రొమాంటిక్' టైటిల్‌కు న్యాయం చేసేలా ఉంది. ఆకాష్ పూరి, కేతికల మధ్య రొమాంటిక్స్ సీన్స్ పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. స్వచ్ఛమైన ప్రేమకు, శరీరాన్ని చూసి పుట్టే ప్రేమకు మధ్య ఉండే తేడాను ఈ సినిమాలో చూపించబోతున్నారని అర్థమవుతోంది. వాస్కో పాత్రలో ఆకాష్ పూరి, మౌనిక క్యారెక్టర్లో కేతిక శర్మ రొమాంటిక్స్ సీన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతారు. రొమాంటిక్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీలో ఆకాష్ పూరి అద్భుతంగా నటించారు. కేతిక శర్మ తన అందాలతో కుర్రకారును కట్టిపడేసేలా ఉంది. ఈ ఇద్దరి జోడి తెరపై ఫ్రెష్‌గా కనిపించింది. రమ్యకష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించింది. పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్స్ ఈ చిత్రానికి ప్లస్ అవనున్నాయి. సునీల్ కశ్యప్ సంగీతం, నరేష్ సినిటోగ్రఫీ బాగా కుదిరాయి. ట్రైలర్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉండటంతోపాటు సినిమా మీద అంచనాలను పెంచేసింది' అని తెలిపారు.