Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రజనీకాంత్, నయనతార జంటగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అన్నాత్తె'. పక్కా మాస్ కమర్షియల్ సినిమాగా తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో 'పెద్దన్న'గా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర తెలుగు అనువాద హక్కుల్ని ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్పి సంస్థ సొంతం చేసుకుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతోన్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో ఈ చిత్రానికి తెలుగులో 'పెద్దన్న' అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు.
'దసరా సందర్భంగా ఇటీవల విడుదల చేసిన తెలుగు పోస్టర్‌కి అద్భుత స్పందన లభించింది. ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్ మీద కత్తి పట్టుకుని రజనీకాంత్ తన మాస్ అవతరాన్ని చూపించారు. పోస్టర్ తీరు చూస్తుంటే హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నట్టు కనిపిస్తోంది. రజినీ లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే తమిళంలో విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. త్వరలోనే తెలుగు టీజర్ రిలీజ్ కానుంది. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ సినిమాని తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది. మీనా, కుష్బూ, కీర్తి సురేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం : ఇమ్మాన్, సినిమాటోగ్రఫీ : వెట్రి, ఎడిటింగ్ : రూబెన్.