Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెండితెరకు మరో నట వారసుడు విరాట్ రాజ్ పరిచయం అవుతున్నారు. అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు విరాట్‌రాజ్. ఇటు తాత వెంకట సుబ్బరాజు, అటు పెద తాత హరనాథ్గారి స్ఫూర్తితో 'సీతామనోహర శ్రీరాఘవ' చిత్రం ద్వారా ఆయన హీరోగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రం బుధవారం రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు, ఆత్మీయుల సమక్షంలో వైభవంగా ప్రారంభమైంది. అగ్ర నిర్మాత ఎ.ఎం.రత్నం ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు అనిల్ రావిపూడి క్లాప్ ఇచ్చారు. యువ కథానాయకుడు ఆకాష్ పూరి గౌరవ దర్శకత్వం వహించారు. వందన మూవీస్ పతాకంపై సుధాకర్.టి నిర్మిస్తున్న ఈ చిత్రంతో దుర్గా శ్రీవత్సవ కె. దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, 'ఈ చిత్రానికి 'సీతామనోహర శ్రీరాఘవ' అనే టైటిల్ ఎందుకు పెట్టామనేది సస్పెన్స్. మాస్ ఎంటర్ టైనర్‌గా, భావోద్వేగాల సమాహారంగా సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా తెరకెక్కించబోతున్నాం' అని చెప్పారు. 'హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ఈ సినిమా నాకు పర్ఫెక్ట్గా యాప్ట్. అందరీ అశీస్సులతో ప్రేక్షకుల ఆదరణ పొందగలననే నమ్మకం ఉంది' అని హీరో విరాట్ రాజ్ అన్నారు.
'వెండితెరకు మరో నట వారసుడుని మా 'వందన మూవీస్' బ్యానర్ ద్వారా పరిచయం చేయటం ఆనందంగా ఉంది. అలాగే ఓ మంచి కథతో మా బ్యానర్ కూడా ప్రేక్షకులకు పరిచయం కావటం విశేషంగా భావిస్తున్నాం. నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్‌ని స్టార్ట్ చేస్తాం. 'కె.జి.ఎఫ్.2', 'సలార్' చిత్రాలకు సంగీతం సమకూరుస్తున్న రవి బస్ రుర్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సంగీతం ఈ చిత్రాన్ని మరో మెట్టు ఎక్కిస్తుందని నమ్ముతున్నాను. అలాగే 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి పోరాటాలు సమకూర్చిన కింగ్ సాల్మన్ ఈ సినిమా కోసం కంపోజ్ చేస్తున్న యాక్షన్ సీక్వెన్స్‌లు మరో ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి' అని నిర్మాత టి.సుధాకర్ తెలిపారు.
విరాట్ రాజ్, రేవ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్లభరణి, బ్రహ్మాజీ, పథ్వీ, కబీర్ దుహాన్ సింగ్, ప్రవీణ్, గోపరాజు రమణ, రాఘవ,కష్ణ, నిఖిలేంద్ర, సత్య సాయి శ్రీనివాస్, రూపాలక్ష్మి ఇతర ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం : రవి బస్ రుర్, పాటలు : రామజోగయ్య శాస్త్రి, కెమెరా: కల్యాణ్. బి, ఎడిటర్: కాశ్యప్ గోలి, ఆర్ట్: రామాంజనేయులు, నత్యాలు: శేఖర్, జానీ మాస్టర్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామాచారి.ఎం. నిర్మాత : సుధాకర్ టి. కథ-స్క్రీన్ ప్లే-మాటలు- దర్శకత్వం: దుర్గా శ్రీ వత్సస.కె.