Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరికొత్త అప్డేట్తో తన అభిమానుల్ని అగ్ర కథానాయకుడు ప్రభాస్ ఖుషీ చేశారు. తన బర్త్‌డేని పురస్కరించుకుని ఈ నెల 23న 'రాధేశ్యామ్' చిత్రంలో తాను పోషిస్తున్న విక్రమాదిత్య క్యారెక్టర్ టీజర్‌ని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ బుధవారం చిత్ర బృందం ఓ పోస్టర్ని విడుదల చేసింది. ఇందులో ఓ రాజమహాల్ దర్బార్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రభాస్ చాలా సీరియస్‌గా ఉన్నారు. ఈ పోస్టర్‌పై విక్రమాదిత్య అంటే ఎవరు? అని రాసి ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం ఈనెల 23న విడుదలయ్యే టీజర్‌తో దొరుకుతుందనే విషయాన్ని మేకర్స్ చెప్పకనే చెప్పారు. అలాగే ఈ టీజర్లో డైలాగ్స్ అన్నీ ఇంగ్లీష్‌లో ఉండబోతున్నాయట. అందరికీ అర్థమయ్యేలా భిన్న భాషల్లో సబ్ టైటిల్స్ కూడా ఉంటాయని చిత్ర బృందం తెలిపింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం 'రాధేశ్యామ్'. దాదాపు 10 ఏండ్ల తర్వాత ప్రభాస్ రొమాంటిక్ జోనర్లో నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌తోపాటు పరిశ్రమ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనవరి 14, 2022న ఈ సినిమా తెలుగుతో పాటు పాన్ ఇండియన్ స్థాయిలో విడుదల కానుంది. డాక్టర్ యువీ కష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, ప్రసీధ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.