Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'దర్జా'. సలీమ్ మాలిక్ దర్శకుడు. శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్‌ను మాజీ హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ' నిర్మాత శివ శంకర్ నాకు అన్ని విషయాల్లోనూ చేదోడు, వాదోడుగా ఉంటాడు. ఆయన నిర్మిస్తున్న 'దర్జా' చిత్ర టైటిల్ లుక్ చాలా బాగుంది. మంచి కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ సినిమా మంచి ఆదరణ పొందాలి' అని తెలిపారు.
'ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను మంత్రివర్యులు కామినేని శ్రీనివాస్‌గారు ఆవిష్కరించటం ఎంతో ఆనందంగా ఉంది. సీనియర్ నటీనటులు, నూతన నటీనటుల కలయికలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హైదరాబాద్, భీమవరం, మచిలీపట్నంలోని అందమైన లొకేషన్లలో షూటింగ్ జరపనున్నాం. రెగ్యులర్ షూటింగ్ ఏకధాటిగా జరుగుతోంది. సరికొత్త కథతో ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందే ఈ చిత్రంలో సునీల్, అనసూయ పాత్రలు హైలెట్‌గా ఉంటాయి' అని దర్శక, నిర్మాతలు చెప్పారు.
అక్సాఖాన్, షమ్ము, సత్యనారాయణరాజు (సత్తిపండు), షకలక శంకర్, సుధ, సూర్య, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దర్శన్, సంగీతం: రాప్ రాక్ షకీల్, ఎడిటర్: ఎమ్.ఆర్. వర్మ, కథ: నజీర్, మాటలు: పి.రాజేంద్రకుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి పైడిపాటి.