Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'ఎఫ్3'. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమాలు ఏకధాటిగా హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ముఖ్య తారాగణం అంతా పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్, రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. తాజాగా మరో ముఖ్య పాత్రలో హీరోయిన్ సోనాల్ చౌహాన్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లోనే ఆమె కూడా షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ గురువారం సోనాల్ చౌహాన్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ : హర్షిత్ రెడ్డి, సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్, కెమెరామెన్ : సాయి శ్రీరామ్, ఎడిటింగ్ : తమ్మిరాజు.