Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'మిస్సింగ్'. ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. శ్రీని జోస్యుల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కి రెడీ అయ్యింది. తాజాగా గురువారం 'ఖుల్లమ్ ఖుల్లా..' అంటూ సాగే ప్రమోషనల్ సాంగ్ అగ్ర దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో హర్షా నర్రా మాట్లాడుతూ, 'మా ''మిస్సింగ్'' సినిమాలోని ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేసిన క్రిష్ గారికి థ్యాంక్స్. అనురాగ్ కులకర్ణి బాగా పాడాడు. అంతా కొత్తవాళ్లం చేసిన ప్రయత్నమిది. ఈనెల 29న మా చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తున్నాం. ఎందుకంటే, మా సినిమాలోని విజువల్స్, సౌండింగ్, మేకింగ్ థియేటర్స్‌కే కరెక్ట్. మంచి థ్రిల్లర్‌గా చేశాం. ఫ్యామిలీ అంతా చూసేలా సినిమా ఉంటుంది' అని తెలిపారు.
'ఈ సినిమాలో మిస్ అయ్యేది నేనే. నాకోసం హీరోతోపాటు మిగతా వాళ్లంతా సెర్చ్ చేస్తుంటారు. సినిమా కచ్చితంగా మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది' అని హీరోయిన్ నికీషా అన్నారు. మరో హీరోయిన్ మిషా నారంగ్ మాట్లాడుతూ, 'ఇదొక యూనిక్ సబ్జెక్ట్ ఉన్న సినిమా. అన్ని ఎమోషన్స్ అలాగే థ్రిల్లింగ్, రొమాన్స్, సస్పెన్స్ ఇలా మీకు నచ్చే అన్ని ఎలిమెంట్స్‌తోనూ సినిమా ఉంటుంది'