Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'రౌడీ బార్సు'. దిల్‌రాజు ప్రొడక్షన్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్‌తో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. బుధవారం ఈ సినిమాలోని 'ప్రేమే ఆకాశం..' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో విజరు దేవరకొండ ఈ సాంగ్‌ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'శ్రీహర్ష యూత్ మీటర్ పర్పెక్ట్గా తెలిసిన దర్శకుడు. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. 'హుషారు' తర్వాత తాను చేసిన ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. అనుపమ మంచి నటి. దిల్‌రాజుగారు, శిరీష్‌గారు సామాన్యమైన వ్యక్తులు కాదు. వాళ్లు గర్వపడేలా ఆశిష్ గొప్ప నటుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను. రాజుగారితో మైండ్ బ్లోయింగ్ సినిమా చేయాలని వెయిట్ చేస్తున్నాను. త్వరలోనే ఎనౌన్స్ చేస్తాం. నవంబర్ 19న 'రౌడీ బార్సు' ప్రేక్షకుల ముందుకొస్తున్నారు' అని తెలిపారు.