Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన నయా చిత్రం 'డేంజరస్'. ట్రీకీ మీడియా ప్రొడక్షన్ సమర్పణలో నైనా గంగూలీ, అప్సరా రాణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది.
శుక్రవారం ఈ చిత్రంలోని 'ఖత్రా..' అంటూ సాగే పాటను దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. 'సెక్షన్ 377ను రద్దు చేసి సుప్రీమ్ కోర్టు స్వలింగ సంబంధాలను చట్టబద్ధం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో భారతదేశంలోనే మొట్ట మొదటి లెస్బియన్, క్రైమ్, యాక్షన్, లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. అలాగే వరల్డ్‌లోనే తొలిసారి ఈ చిత్రం బ్లోక్ చైన్‌లో ఎన్ఎఫ్టిగా అమ్మకానికి ఉంది. దీన్ని ఫియట్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ ద్వారా కొనుగోలు చేయొచ్చు. అలాగే డేంజర్ టోకెన్స్ కొనుగోలు చేసి కూడా పార్టనర్స్‌గా లేక సినిమాని పూర్తిగా కూడా సొంతం చేసుకోవచ్చు. పే పర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో వీటి ద్వారా వచ్చే ఆదాయం ప్రతి పెట్టుబడిదారుడి పెట్టుబడి రేషియోకి అనుగుణంగా ఇచ్చే వెసులుబాటు కల్పించారు. ప్రేక్షకులు సైతం ఈ చిత్రాన్ని డేంజర్ టోకెన్స్, డాలర్స్, క్రిప్టో కరెన్సీ ద్వారా కొనుగోలు చేసి చూడవచ్చు' అని చిత్ర యూనిట్ పేర్కొంది.