Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'లవ్‌స్టోరీ'. ఇటీవల విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం శుక్రవారం నుంచి తెలుగు ఓటీటీ మాధ్యమం 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, 'కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన మా 'లవ్‌స్టోరి' చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చి చూసి, మా ప్రయత్నాన్ని ఆశీర్వదించారు. ఇప్పుడు ఈ సినిమా తెలుగు ఓటీటీ మాధ్యమమైన 'ఆహా'లో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి అందుబాటులోకి వచ్చింది. ఓటీటీ వేదికల ద్వారా విడుదలవుతున్న చిత్రాలను ఈ మధ్య చాలా మంది పైరసీ చేస్తున్నారు. దయచేసి పైరసీని ప్రోత్సహించకండి. పైరసీని అరికట్టండి. పైరసీని అరికట్టకపోతే నిర్మాతకి తద్వారా పరిశ్రమని నమ్ముకుని బతుకుతున్న అందరిపైనా తీవ్ర ప్రభావం పడుతుంది' అని తెలిపారు.
హెచ్వీ చలపతి రాజుమాట్లాడుతూ,.'కొంతమంది కేబుల్ ఆపరేటర్లు పైరసీ చేస్తున్నారు. ఇది చట్టరీత్యా నేరం. 'లవ్ స్టోరీ' చిత్రాన్ని ఎవరైనా పైరసీ చేశారని తెలిస్తే, ఎంత పెద్ద వారైనా సరే కేసులు పెడతాం.పైరసీని ఆరికట్టి, పరిశ్రమని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది' అని చెప్పారు.