Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కె సిరీస్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్‌పై క్రిష్ బండిపల్లి నిర్మిస్తున్న చిత్రం 'రావణ లంక'. బిఎన్ఎస్ రాజు దర్శకుడు. క్రిష్ బండిపల్లి సరసన అస్మిత కౌర్ భక్షి కథానాయికగా నటించింది. తాజాగా హీరో, 'మా' నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ఈ చిత్ర ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో, నిర్మాత క్రిష్ బండిపల్లి మాట్లాడుతూ,'రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతోమందికి ఉపాధి కల్పించి, వ్యాపారవేత్తగా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాను. ఇప్పుడు సినీ రంగంలోకి అడుగుపెట్టి హీరోగా నటిస్తూనే, నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించాను. మా చిత్ర ట్రైలర్‌ను మంచు విష్ణు రిలీజ్ చేయటం ఆనందంగా ఉంది. అటు మాస్, ఇటు క్లాస్ ఆడియెన్స్‌ని ఆకట్టుకునే విధంగా ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సినిమా ఉంటుంది. టైటిల్ జస్టిఫికేషన్ ఎలా ఉంటుంది అనేది మాటల్లో కంటే వెండితెరపై చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అందర్నీ మెప్పించే చిత్రమిది ఆదిత్య మ్యూజిక్ ద్వారా మా సినిమా ఆడియో రిలీజై మంచి ఆదరణ పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 29న భారీ రేంజ్లో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నాం. హీరోగా, నిర్మాతగా నాకు మంచి గుర్తింపు తెచ్చే చిత్రమిది' అని చెప్పారు. మురళీశర్మ, రచ్చరవి, దేవ్‌గిల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ : ఉజ్జల కుమార్ సాహా, కెమెరా : హజర్ తాహై షేక్, ఎడిటర్ : వినోద్.