Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బాహుబలి' సిరీస్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్న కథానాయకుడు ప్రభాస్. స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులతోపాటు యావత్ ప్రేక్షకలోకం 'డార్లింగ్' అని ముద్దుగా పిలుచుకునే రెబల్‌స్టార్ ప్రభాస్ బర్త్‌డే నేడు (శనివారం). ప్రస్తుతం ఐదు పాన్ ఇండియా స్థాయి సినిమాల్లో, ఐదు భిన్న జోనర్లతో, ఐదు భిన్న పాత్రలతో అలరించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నారు. వరసగా ఐదు పాన్ఇండియా చిత్రాల్లో నటిస్తున్న అరుదైన హీరో ప్రభాసే కావడం మరో విశేషం. అద్భుతమైన ప్రేమకథతో రూపొందిన 'రాధేశ్యామ్' చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో లవర్ బారుగా ప్రభాస్ కనిపించబోతున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఈ చిత్ర టీజర్ నేడు (శనివారం) రిలీజ్ అవుతోంది. ఇందులో పూజా హెగ్డే నాయిక. ఇదిలా ఉంటే, పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా 'సలార్' తెరకెక్కుతోంది. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
అలాగే తొలిసారి వెండితెర శ్రీరాముడిగా ప్రభాస్ దర్శనమివ్వబోతున్నారు. మైథలాజికల్ జోనర్లో రూపొందుతున్న 'ఆదిపురుష్' చిత్రంలో రాముడిగా ప్రభాస్ నటిస్తున్నారు. ఓం ప్రకాశ్ రౌత్ దర్శకత్వంలో టీ సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'మహానటి' ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'ప్రాజెక్ట్ కె'. సైన్స్ ఫిక్షన్ బ్యాక్్డ్రాప్లో పాన్‌వరల్డ్ సినిమాగా రూపొందనుంది. ఇందులో బాలీవుడ్ నాయిక దీపికా పదుకొనే ప్రభాస్ సరసన నటిస్తుండగా, బిగ్‌బి అమితాబ్ మరో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఓ వైవిధ్యమైన కథతో 'స్పిరిట్' చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించేందుకు గ్రీన్‌సిగల్ ఇచ్చారు. ఇది ప్రభాస్ నటిస్తున్న 25వ కావడం విశేషం. దీన్ని 8 భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.