Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తన్నిష్ఠ ఛటర్జీ, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో రాజేష్ టచ్‌రివర్ తెరకెక్కించిన చిత్రం 'దహిణి'. ఓరియన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, సన్‌టచ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సునీత కష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'ఒరిస్సాలోని మయూర్ బంజ్ జిల్లా, పరిసర ప్రాంతాల్లో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందు తోంది. మంత్రగత్తెలు అనే నెపంతో వేలాది మంది అమాయక మహిళలను ప్రజలు అతి క్రూరంగా చంపేశారు. ఆధునిక కాలంలో కూడా లింగ ఆధారిత హింసతో, ఇప్పటికీ అనాగరిక చర్యలను ఆచరిస్తున్నాం. ఇది మానవ హక్కుల ఉల్లంఘన, అయినప్పటికీ ఎవ్వరూ ఈ దారుణాన్ని అంగీకరించక పోవడం మన దురదష్టం. శతాబ్దాల క్రూరత్వాన్ని అంతం చేయడానికి, సమష్టి స్వరాన్ని సష్టించడానికి మేం చేసిన ప్రయత్నమే ఈ సినిమా. అమాయకులైన వేలాది మంది మహిళలను 'విచ్ హంటింగ్' పేరుతో అమానుషంగా ఎలా మట్టుపెడుతున్నారు? అనే క్రూరమైన వాస్తవికతను బహిర్గతం చేసే ఇటువంటి అద్భుతమైన ప్రయత్నంలో భాగం కావడం మా అదష్టం. మన దేశంతో పాటు పలు దేశాలను పట్టి పీడిస్తున్న 'విచ్ హంటింగ్' సమస్యను వెలుగులోకి తీసుకురావాలని, వివాదాస్పద అంశాలను స్పశిస్తూ దర్శకుడు రాజేష్ టచ్ రివర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు' అని చెప్పారు.