Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హీరో విజరు దేవరకొండ
ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం 'రొమాంటిక్'. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను వరంగల్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన హీరో విజరు దేవరకొండ మాట్లాడుతూ, 'మన హీరో ఆకాష్లో మంచి ఫైర్ ఉంది. దాన్ని ఫ్రూవ్ చేేసి, వాళ్ళ నాన్న పూరి కాలర్ ఎగరేశాలా చేయాలి. ఈ సినిమాతో ఆకాష్ సక్సెస్ కొడతాడని నమ్ముతున్నా. పూరి, ఛార్మితో చేస్తున్న 'లైగర్' సినిమాతో ఇండియాని షేక్ చేస్తాం. ఫిక్స్ అయిపోండి ఇది ఖాయం' అని చెప్పారు. 'ఈ కథను నన్ను డైరెక్ట్ చేయమని పూరి, ఛార్మీ చెప్పారు. ఫస్ట్ కాపీ చూశాక బాగుందన్నారు. నా డెబ్యూ సినిమాకి హీరోగా ఆకాష్ దొరకడం నా అదష్టం. ఆకాష్, కేతిక అద్భుతంగా నటించారు' అని డైరెక్టర్ అనిల్ పాదూరి తెలిపారు.
'ఈ సినిమా నాకెంతో స్పెషల్. నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు పూరి, ఛార్మీకి థ్యాంక్స్. ఆకాష్ సూపర్‌గా నటించారు. రమ్యకష్ణ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది' అని కథానాయిక కేతికశర్మ అన్నారు. నిర్మాత ఛార్మీ మాట్లాడుతూ, 'మళ్లీ మళ్లీ చెప్పుకునేలా పూరి గారు ఈ సినిమాలో డైలాగ్స్ రాశారు' అని తెలిపారు.
'ఈ సినిమాను అనిల్ బాగా ప్రెజెంట్ చేశాడు. నేను నాలుగైదు సార్లు చూశా. నాకు చాలా బాగా నచ్చింది. సెకండాఫ్ బాగుంటుంది. క్లైమాక్స్ అయితే సూపర్. ఆకాష్, కేతిక, రమ్య ఇరగొట్టేశారు. చాలా ట్రెండీగా ఉండే సినిమా ఇది. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఈ సినిమా చూడండి' అని పూరి జగన్నాథ్ అన్నారు.
ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాం. మా నాన్న గురించి ఎవరైనా బ్యాడ్ కామెంట్లు పెడితే, వాళ్లని కొట్టాలని అనిపించేది. ఇక పూరి సినిమాలు ఎవరు చూస్తారు?, కెరీర్ అయిపోయిందన్న వాళ్లకు ఒకటే చెబుతున్నా.. నేనే కాదు మా వాడు కూడా హిట్ కొట్టాడ్రా అంటూ నాన్న కాలర్ ఎగరేసే మూమెంట్ వస్తుంది.
- హీరో ఆకాష్ పూరి