Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయి రోనక్, నేహ సోలంకి హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'ఛలో ప్రేమిద్దాం'. హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదరు కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్‌లో అగ్ర దర్శకుడు గోపీచంద్ మలినేని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'అందరూ ప్రొడ్యూసర్ ఉదరుకిరణ్ గురించి గొప్పగా చెబుతుంటే నాకు, నా తొలి సినిమా నిర్మాత వెంకట్ గారు గుర్తొచ్చారు. ఎందుకంటే ఆయన కూడా ఒక కొత్త డైరక్టర్‌కి ఎంత సపోర్ట్ చేయాలో, అంత సపోర్ట్ చేశారు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఉదరు కిరణ్ గారు కచ్చితంగా గొప్ప నిర్మాతగా ఎదుగుతారు. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చూశాక విజువల్ ట్రీట్‌లా ఈ సినిమా ఉండబోతుందని అర్థమవుతోంది' అని చెప్పారు.
'ఈ సినిమా దర్శక, నిర్మాతలు నాకు మంచి సన్నిహితులు. సినిమాపై మంచి ప్యాషన్ ఉన్నవాళ్ళు. మోషన్ పోస్టర్ గ్రాండ్‌గా ఉంది. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుంది' అని నిర్మాత బెక్కం వేణుగోపాల్ చెప్పారు. చిత్ర నిర్మాత ఉదరు కిరణ్ మాట్లాడుతూ, 'సినిమా పూర్తయింది. నవంబర్ నెలాఖరులో సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఓ మంచి కాన్సెప్ట్‌తో చేసిన మా సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం' అని అన్నారు. 'మా నిర్మాత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలాగే హీరో, హీరోయిన్స్ ఎంతో సపోర్ట్ చేశారు. సాయి రోనక్ పెద్ద హీరో అవుతాడు. శశాంక్ చాలా మంచి పాత్ర పోషించాడు. భీమ్స్ పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చారు. త్వరలో పాటలు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని దర్శకుడు సురేష్ శేఖర్ రేపల్లె చెప్పారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ, 'నా క్యారెక్టర్ని దర్శకుడు అద్భుతంగా డిజైన్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా గ్రాండ్‌గా తీశారు. భీమ్స్ పాటలు, నేపథ్య సంగీతం బాగా కుదిరాయి. సినిమా చూశా. చాలా బాగా వచ్చింది. యాక్షన్, లవ్, కామెడీ, ఫన్, సస్పెన్స్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ మా సినిమాలో ఉన్నాయి' అని తెలిపారు.
'భీమ్స్ గారు ఎప్పటిలాగే మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చారు. దర్శకుడు మంచి లిరిక్స్ రాయించుకున్నారు. మంచి కథకి మంచి సాహిత్యం, సంగీతం బాగా కుదిరాయి' అని గీత రచయిత సురేష్ గంగుల అన్నారు.