Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాష్ పూరి, కేతిక శర్మ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'రొమాంటిక్'. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిల్ పాదురి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా ఆదివారం దర్శకుడు అనిల్ మీడియాతో మాట్లాడుతూ, 'ఇంజనీరింగ్ చేసినా కూడా ఆర్ట్ మీద ఉన్న ఆసక్తితో సినీ రంగం వైపు వచ్చాను. వీఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్లో పని చేశా. హీరో కళ్యాణ్ రామ్‌తో కలిసి ఓ వీఎఫ్ఎక్స్ కంపెనీ స్టార్ట్ చేశా. ఎన్టీఆర్ 'టెంపర్' సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు పూరిగారితో పరిచయం ఏర్పడింది. నేను రాసే లైన్స్, కథలు ఆయనకి బాగా నచ్చేవి. ఆ నమ్మకంతోనే ఈ సినిమాకి కథకి ఇచ్చి, డైరెక్ట్ చేయమని ప్రోత్సహించారు. మోహానికి, ప్రేమకు మధ్య జరిగే కథే ఈ సినిమా. ప్రస్తుతం ఆకర్షణనే ప్రేమ అని అనుకుంటున్నారు. అందుకే కొద్ది కాలానికే విడిపోతున్నారు. ప్రేమకి, ఆకర్షణకు మధ్య ఉన్న సన్నని గీత గురించి ఇందులో వివరించాం. ప్రేమను నమ్మని ఓ కుర్రాడు, ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేది కథ. ఈ కథకు ఆకాష్ కరెక్ట్‌గా సరిపోయారు. పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. కేతిక శర్మ చాలా బాగా చేసింది. రమ్యకష్ణ రావడంతో మా సినిమా లుక్ మారిపోయింది. ఈ చిత్రానికి ఆమె మెయిన్ పిల్లర్. ఇది కేవలం యూత్ సినిమానే కాదు. ఫ్యామిలీ మొత్తం చూసేలా ఉంటుంది. పూరి గారు కథ, మాటలు రాసినప్పటికీ నా మార్క్ కచ్చితంగా కనిపిస్తుంది. ఫైనల్ కట్ అయ్యాక ఈ చిత్రాన్ని ఆయన చూసి, కన్నీళ్ళు పెట్టుకున్నారు. 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాలో కంటే ఎక్కువ ఎమోషన్ ఉంది. మంచి సినిమా తీశావ్ అంటూ మెచ్చుకున్నారు. ఈ సినిమాకి ఓటీటీ ఆఫర్లు వచ్చినా కూడా రిజెక్ట్ చేసి, థియేటర్లలోనే రిలీజ్ చేయాలని నిర్మాతలు పూరి, ఛార్మి ఫిక్స్ అయినందుకు కృతజ్ఞతలు. నా నెక్ట్స్ సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో ఉంటుంది' అని చెప్పారు.