Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్ ముఖ్య పాత్రధారులుగా నటించిన చిత్రం 'తెలంగాణ దేవుడు'. మ్యాక్ లాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హరీష్ వడత్యా దర్శకత్వంలో మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, 'చరిత్ర సష్టించిన వ్యక్తి పాత్రలో నటించటం గర్వంగా ఉంది. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి' అని చెప్పారు. 'ఇటువంటి గొప్ప చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ధైర్యం ఇచ్చిన నిర్మాత జాకీర్ ఉస్మాన్‌కి, సినిమా బాగా రావడానికి సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు' అని దర్శకుడు హరీష్ వడత్యా అన్నారు.
నిర్మాత మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ, 'ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి బయోపిక్‌గా రూపుదిద్దుకున్న మా చిత్రంలో, తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఏం జరిగిందనే అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించాం. ఇది ఓ మహనీయుని చరిత్ర. తెలంగాణ ఉద్యమం భావితరాలకు ఒక నిఘంటువు. అటువంటి ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఉద్యమనాయకుడి చరిత్ర అందరికీ తెలియాలనే సంకల్పంతో ఈ సినిమా చేశాం' అని తెలిపారు.