Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ నాయకానాయికలుగా రూపొందుతున్న చిత్రం 'ఎఫ్3'. దిల్‌రాజు సమర్పణలో అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. ఆద్యంతం వినోదభరితంగా ఉండే ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ఆదివారం అధికారికంగా ప్రకటించింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురాబోతోంది. ఇదే కాంబినేషన్లో రూపొందిన 'ఎఫ్2' చిత్రం 2019 సంక్రాంతి కానుకగా విడుదలై, సంచలన విజయం సాధించింది. అలాగే భారీ వసూళ్ళతో టాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. నవ్వుల సునామీగా విశేష ఆదరణ పొందింది. భార్యల వల్ల ఇబ్బంది పడే భర్తల కాన్సెప్ట్‌తో 'ఎఫ్2' రూపొందితే, డబ్బు వల్ల జరిగే అనర్ధాలు, దీని వల్ల భార్యాభర్తల మధ్య జరిగే సంఘటనల సమాహారంగా 'ఎఫ్3' చిత్రాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.