Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్, శెర్రి అగర్వాల్ నటీనటులుగా రూపొందుతున్న చిత్రం 'రామ్ అసుర్'. ఎఎస్పి మీడియా హౌస్, జివి ఐడియాస్ పతాకాలపై వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర.టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌ను సోమవారం ఫిల్మ్ ఛాంబర్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా విచ్చేసిన నిర్మాత రాజ్ కందుకూరి, ఇన్ కమ్ ట్యాక్స్ ఎడిషనల్ కమీషనర్ జీవన్ లాల్ ఈ చిత్ర టైటిల్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాత వెంకటేష్ త్రిపర్ణ మాట్లాడుతూ,'మాస్ ఆడియన్స్‌కు, కమర్షియల్ ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో 'పీనట్ డైమండ్' అనే ఇంగ్లీష్ టైటిల్‌ని మార్చి, అందరికీ అర్థమయ్యే విధంగా 'రామ్ అసుర్'గా టైటిల్ పెట్టాం. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మాకు కొత్త ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుండి పెద్ద ఆఫర్ వచ్చింది. మేం పెట్టిన బడ్జెట్‌కు మూడు రెట్లు ఎక్కువ ఆఫర్ ఇస్తామని చెప్పినా, దాన్ని రిజెక్ట్ చేశాం. ఎందుకంటే ఈ సినిమాలోని విజువల్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని థియేటర్లో చూసిన ప్రేక్షకులు తప్పకుండా ఎంజారు చేస్తారు. నవంబర్ 19న రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు వరల్డ్ వైడ్‌గా భారీ రేంజ్లో మా చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం' అని అన్నారు.
చిత్ర హీరో, నిర్మాత అభినవ్ సర్ధార్ మాట్లాడుతూ, 'ప్రభాకర్ రెడ్డి కెమెరామెన్ పనితరం, భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్, సుమన్, శుభలేక సుధాకర్.. ఇలా పెద్ద ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేయడంతో ప్రొడక్షన్ వ్యాల్యూస్ పెరిగి సినిమా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళింది. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్‌లోనూ ఇటువంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు. ఇలాంటి పాయింట్‌ని ఎవ్వరూ టచ్ చేయలేదు, తీయలేదు. మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది' అని తెలిపారు.