Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం 'రొమాంటిక్'. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిల్ పాదురి దర్శకుడు. ఈ చిత్రం ఈనెల 29 విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం ఈ చిత్ర సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మీడియాతో మాట్లాడుతూ, 'ఇందులో 'పీనే కే బాద్' పాట చాలా పెద్ద హిట్ అయింది. పూరిగారికి పాటలు చాలా బాగా నచ్చాయి. అనిల్ అయితే పర్టిక్యులర్‌గా ఇలాంటి పాటలే కావాలని అనేవాడు. ఈ చిత్రంలో కేతిక శర్మ కూడా 'నా వల్ల కాదే..' అనే పాట పాడింది. అది కూడా పెద్ద హిట్ అయింది. ఈ మధ్య విడుదల చేసిన 'వాస్కోడిగామ..' పాటలో ఆకాష్ వాయిస్ అద్బుతంగా ఉంది. అలాగే నటన పరంగా ఆకాష్‌ని మరో మెట్టు ఎక్కించే చిత్రమని ఆర్ఆర్ చేసేటప్పుడు నాకు అర్థమైంది. దర్శకుడు అనిల్ కూడా అద్భుతంగా తెరకెక్కించాడు. అందరం కూడా చాలా ఇష్టపడి ఈ సినిమాని చేశాం. కచ్చితంగా హిట్ అయ్యే సినిమా ఇది. ఈ సినిమా చాలా ఎమోషనల్ కంటెంట్ ఉంది. ద్వితీయార్థం ఫుల్ ఎమోషనల్‌గా ఉంటుంది. పూరి గారు మామూలుగా ఎప్పుడూ ఎమోషనల్ అవ్వరు. అలాంటిది ఆయన కన్నీంటి పర్యంతమయ్యారు. ఈ సినిమా ఆయన్ని ఎమోషనల్‌గా బాగా టచ్ చేసిందనుకున్నా. రేపు ప్రేక్షకులు కూడా ఇదే ఫీల్ అవుతారనే నమ్మకం ఉంది. ఇక నా జర్నీలో ఎక్కువగా గీత రచయిత భాస్కరభట్ల ఉంటారు. ఈ చిత్రంలో 'పీనే కే బాద్', అలాగే 'నా వల్ల కాదే..' పాటలను అద్భుతంగా రాశారు. ఆయనతో నాకు ఇది నాలుగో సినిమా. 'జ్యోతి లక్ష్మీ' నుంచి 'రొమాంటిక్' వరకు ఆయన నాకు ఓ బలంగా మారిపోయారు. ప్రస్తుతం సత్యదేవ్ 'గాడ్సే' చిత్రంతోపాటు మరో రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నా' అని తెలిపారు.